Movie News

కొండపొలం హడావిడి ఏది?



2021-09-22 20:01:25 :

వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రం… ‘కొండపొలం’. ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అతని నుంచి వస్తున్న మూవీ కావడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఐతే, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా… ఇంకా ప్రొమోషన్ హడావిడి లేదు. టైటిల్, పోస్టర్, ఒక పాట రిలీజ్ చేసి ప్రమోషన్ ఆపేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి గురి కావడంతో వైష్ణవ్ ఆ బాధలో బయటికి రాలేదు వైష్ణవ్. ఇప్పుడు సాయి తేజ్ కోలుకుంటున్నాడు. సో, వైష్ణవ్ తన మూడో సినిమా షూటింగ్ కి వెళ్ళిపోయాడు.

మరి ‘కొండపొలం’ హడావిడి మొదలవుతుందా? ఈ సినిమాకి దర్శకుడు క్రిష్. పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తూనే ‘కొండపొలం’ సినిమా పూర్తి చేశాడు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ భారీ విజయం అందుకున్నాడు కాబట్టి రెండో సినిమాకి మంచి బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ, ఎందుకనో క్రిష్ ఆ హడావిడి చెయ్యడం లేదు.

బహుశా, ‘లవ్ స్టోరీ’ సినిమాకి వచ్చే స్పందన, కలెక్షన్లు చూసిన తరవాత హంగామా స్టార్ట్ చేస్తారేమో.

ఈ సినిమాలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కీరవాణి సంగీతం అందించారు. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది.



{Source} hyperlink

Show More
Back to top button