Movie News

నన్ను ఇన్వాల్వ్ చేయకండి!2021-08-31 22:56:39 :

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ని కూడా ఈడీ అధికారులు విచారించారట. ఇలా సోషల్ మీడియా గుప్పుమంది. దానికి కారణం ఈ రోజు దర్శకుడు పూరి జగన్నాధ్ ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 10 గంటల పాటు విచారించారు. అక్కడ బండ్ల గణేష్ కూడా కనిపించారు. డ్రగ్స్ కేసులో ఈయన్ని కూడా ఈడీ పిలిచిందా అన్న అనుమానాలు వచ్చాయి.

దానిపై బండ్ల క్లారిటీ ఇచ్చాడు. తన మిత్రుడు, దర్శకుడు పూరి జగన్నాధ్ ని కలిసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లానని చెప్పారు బండ్ల గణేష్. దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని ట్విట్టర్లో వేడుకున్నారు బండ్ల గణేష్.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో “టెంపర్” వంటి సినిమాలు నిర్మించారు బండ్ల గణేష్.

2017కి చెందిన డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా మనీ లాండరింగ్ జరిగిందన్న కోణం వెలుగు చూడడంతో ఈడీ అధికారులు పూరి, రకుల్, రానా, రవితేజ, ఛార్మి సహా 12 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో మొదట హాజరైంది పూరి జగన్నాధ్. ఆయనకి ఏమైనా హెల్ప్ అవసరం ఉంటుందనే ఉద్దేశంతో బండ్ల అక్కడికి వెళ్లారట.

{Source} hyperlink

Show More
Back to top button