Movie News

నెల తర్వాత బయటికొచ్చిన శిల్ప



2021-08-16 15:30:26 :

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గత నెల నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి శిల్పాశెట్టి బయటికి అడుగుపెట్టలేదు. మీడియా ముందుకు రాలేదు. ఆమె చేయాల్సిన టీవీ షోలకు కూడా వెళ్ళలేదు.

నెల రోజుల తర్వాత నిన్న (ఆగస్ట్ 15న) ఒక ఈవెంట్ కి వచ్చింది. కరోనా ఫండ్ రైజర్ కోసం నిర్వహించిన ఈవెంట్ లో శిల్ప పాల్గొంది. అయితే, మీడియాతో మాట్లాడలేదు. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె భర్త కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా పోర్న్ చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారనేది పోలీసుల ఆరోపణ. ఈ కేసులో రాజ్ కుంద్రాకు ఇప్పటివరకు బెయిలు కూడా రాలేదు.

40 ప్లస్ శిల్ప టీవీ షోల ద్వారా, యోగ వీడియోల ద్వారా బాగానే ఆర్జిస్తోంది. ఐపీఎల్ బిజినెస్ లో కూడా ఉన్నారు. అంత సంపాదన ఉన్నప్పటికీ, ఆమె భర్త పోర్న్ చిత్రాల నిర్మాణం, అలాంటి యాప్స్ తో వ్యాపారం చెయ్యడం షాక్ కలిగించింది. శిల్ప కూడా అతని అరెస్ట్ ని ఊహించలేదు. అందుకే, ఆమె చాలా రోజులు బాధలో ఉందట.

శిల్ప శెట్టి 14 ఏళ్ల తర్వాత నటించిన ఒక సినిమా కూడా ఇటీవలే ఒటిటిలో విడుదలైంది. ఆ సినిమా ప్రొమోషన్ డుమ్మా కొట్టింది. ఐతే, ఇప్పుడు మెల్లిగా సాధారణ జీవితం గడిపేలా అడుగులు వేస్తోంది.



{Source} hyperlink

Show More
Back to top button