Movie News

బండ్లని లైట్ తీసుకున్న జీవిత2021-09-05 19:03:48 :

జీవిత రాజశేఖర్ కి వ్యతిరేకంగా తాను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. మెగాస్టార్ కుటుంబంపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాను పోటీలో ఉన్నట్లు బండ్ల కలర్ ఇస్తున్నారు. ఐతే, ఆయన ప్రకటనని జీవిత లైట్ గా తీసుకున్నారనే భావన ఏర్పడింది.

“బండ్ల గణేశ్‌తో నాకు విభేదాలు లేవు. ప్యానెల్ లో ఉన్న లేకున్నా… ‘మా’లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా పోటీ చెయ్యొచ్చు. బండ్ల గణేశ్‌ ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్తున్నారు. అందులో తప్పు ఏమి ఉంది. నాకు వ్యతిరేకంగానో, లేదా నాపై కోపంతోనే బండ్ల పోటీ చేస్తున్నారని అనుకోవడం లేదు. మా సభ్యుల సంక్షేమం కోసం ఆయన బరిలో ఉన్నాను అంటున్నారు. ఆయన పోటీని స్వాగతిస్తున్నాను,” అని స్పష్టం చేశారు జీవిత.

ఇన్ డైరెక్ట్ గా ఆమె ఆయన పోటీని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తనకి వ్యతిరేకంగా ఆయన బరిలో దిగినా ఏమి కాదన్న ధీమా ఆమెలో ఉన్నట్లు ఉంది.

బండ్ల గణేష్ వ్యాఖ్యలు, చేష్టలను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. మీడియాలో హడావిడికి బండ్ల పనికొస్తారు తప్ప ఆయనతో ఈదు కాలదు పీరు లేవదు అనే అభిప్రాయం చాలామందిలో ఉన్నట్లు కనిపిస్తోంది.{Source} hyperlink

Show More
Back to top button