Movie News

‘భోజనం’తో సందీప్ కడుపు నిండింది!



2021-08-30 14:36:01 :

హీరోగా, వ్యాపారవేత్తగా సందీప్ కిషన్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా విజృభించే బూస్ట్ దక్కింది. సందీప్ కిషన్ నిర్మించిన “వివాహ భోజ‌నంబు” సినిమా సోనీ లివ్ లో విడుదలైంది. ఈ ఓటిటి సంస్థ తెలుగులో అడుగుపెట్టి రిలీజ్ చేసిన మొదటి సినిమా.

సినిమాలో మొదటి అరగంట నవ్వులు బాగున్నాయని చూసిన వాళ్ళు అంటున్నారు. ఓవరాల్ గా ఓకే మూవీ, ఓటిటిలో టైంపాస్ అనిపించుకొంది. అంటే, నిర్మాతగా సందీప్ సులువుగా సక్సెస్ అయ్యాడు.

కమెడియన్ హీరోగా సత్య నటించిన ఈ కామెడీ చిత్రాన్ని దాదాపు కోటి 25 లక్షలతో నిర్మించాడు సందీప్ కిషన్. అది కూడా కరోనా పరిస్థితుల్లో తక్కువ టైం, లిమిటెడ్ బడ్జెట్ లో తీశాడు. సోనీ లివ్ సంస్థ కోటిన్నర రూపాయలకు కొనుక్కొంది. మరో కోటిపైనే శాటిలైట్ హ‌క్కుల రూపంలో రాబడి వస్తుంది. ఇంక రీమేక్ రైట్స్ రూపంలో కూడా డబ్బు వస్తుంది.

అంటే సందీప్ కిషన్ కి ఇది డబుల్ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాలు తీస్తే ప్రాఫిట్స్ బాగా వస్తాయని సందీప్ కి అర్థమైంది. అందుకే, ‘వివాహ భోజనంబు’ సినిమా ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని సినిమాలు తీస్తాడట. తాను హీరోగా చేసీ సినిమాలకు ఇది అదనపు వ్యవహారం.

కానీ, ఈ సినిమాకి సందీప్ పెద్దగా పబ్లిసిటీ మీద దృష్ఠి పెట్టలేదు. ఆలా చేసి ఉంటే … ఇంకొంచెం హెల్ప్ అయ్యేది.



{Source} hyperlink

Show More
Back to top button