Movie News

రెండుసార్లు బయటపడ్డ కాజల్!



2021-09-19 21:59:36 :

‘బిగ్ బాస్ తెలుగు 5’లో మొదటివారంలోనే నామినేట్ అయింది కాజల్. రెండో వారంలో కూడా ఆమె ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చింది. ఐతే, రెండు సార్లు తప్పించుకొంది. ఈ వారం నటి ఉమాదేవి బయటికెళ్లిపోయారు. అలా, కాజల్ రెండోసారి కూడా ఎలిమినేషన్ ప్రమాదం నుంచి బయటపడింది. ఆర్జేగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న కాజల్ ప్రస్తుతం సేఫ్ జోన్లోకి ఎంటరైనట్లే.

‘బిగ్ బాస్ తెలుగు’ మూడోవారంలో ఎలాంటి చమక్కులు ఉంటాయో చూడాలి.

మరోవైపు, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ వంటి వారు ఎక్కువకాలం హౌజ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ షోలో ప్రస్తుతం గ్లామర్ బాగానే ఉంది. మసాలా డైలాగ్ లు ఫుల్లుగా వినిపిస్తున్నాయి. ఐతే, స్టార్ అట్రాక్షన్ లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీగా ఒక హీరోయిన్ వచ్చే అవకాశం ఉంది.



{Source} hyperlink

Show More
Back to top button