Movie News

హాలీడే ట్రిప్పులో సమంత



2021-09-05 12:58:45 :

హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. మీడియాలో ఎన్నో వార్తలు. కానీ, ఆమె ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, అక్కినేని కుటుంబానికి బంధువు అయిన శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి ఆమె గోవాలో సేదదీరుతోంది.

ప్రతి ఆదివారం ఆమె గడిచిన వారానికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శిల్పారెడ్డి కుటుంబంతో ఆమె ట్రిప్పు ఫోటోలను షేర్ చేసింది సమంత.

సమంత కొన్నాళ్లుగా తన స్టైల్ ని మార్చేసింది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ పోస్టులు పెడుతోంది. తన ప్రతి ట్రిప్పుకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. అలాగే, సెలెబ్రిటీల పుట్టిన రోజులను గుర్తుపెట్టుకొని మరి విష్ చేస్తోంది.

సమంత చేతిలో ప్రస్తుతం ఒక చిత్రం ఉంది. నయనతార కాబోయే భర్త విగ్నేష్ నయనతార, సమంత, విజయ్ సేతుపతిలతో తీస్తున్న మూవీ సెట్స్ పై ఉంది. ‘శాకుంతలం’ షూటింగ్ ఆమె పూర్తి చేసింది. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.



{Source} hyperlink

Show More
Back to top button